![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -257 లో... ప్రేమకి బొకే కొరియర్ రావడంతో శ్రీవల్లికి డౌట్ వస్తుంది. ఏంటని ప్రేమని శ్రీవల్లి అడుగుతుంది . ఏం లేదు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమని ప్రేమ పంపిస్తుంది.
ఆ తర్వాత ప్రేమ బొకే ఓపెన్ చేస్తుంది. అందులో ఇంకా వన్ వీక్ అని ఉంటుంది. కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. నువ్వు ఇలా బొకేలు పంపిస్తే భయపడుతాననుకున్నావా అని ప్రేమ అనగానే.. మరేం చేస్తే భయపడుతావో తెలుసు.. ఒక వీడియో పంపిస్తున్నానని ప్రేమకి వీడియో ఒకటి కళ్యాణ్ పంపిస్తాడు.
ఆ వీడియో ప్రేమ చూసి షాక్ అవుతుంది. ఆ వీడియోలో కళ్యాణ్ తో ప్రేమ లేచిపోయినప్పుడు.. రూమ్ లోకి వెళ్ళినప్పుడు ప్రేమ, కళ్యాణ్ పక్కపక్కన కూర్చొని ఉంటారు. కళ్యాణ్ ఫోన్ చేసి ఇప్పుడు భయపడుతున్నావా.. ఆ వీడియో ఎవరికైనా చూపిస్తే ఏమనుకుంటారో తెలుసు కదా అని కళ్యాణ్ అనగానే ప్రేమకి భయం మొదలమవుతుంది.
మరొకవైపు విశ్వకి పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి అమ్మాయి వాళ్ళు వస్తారు. ఆ విషయం వేదవతికి తిరుపతి చెప్తాడు. ఆ తర్వాత ప్రేమ బాధపడుతుంటే ధీరజ్ వస్తాడు. ఏమైందని అడుగతాడు కానీ ప్రేమ సైలెంట్ గా ఉంటుంది. ఏమైందోనని ప్రేమని ధీరజ్ గుడికి తీసుకొని వెళ్తాడు. అసలు ఏమైంది.. ఎందుకు టెన్షన్ పడుతున్నావ్.. అసలు నువ్వు ఇలా ఉంటావా.. ఎప్పుడు దైర్యంగా ఉంటావ్ ఏమైంది చెప్పమని ప్రేమని ధీరజ్ మోటివేట్ చేస్తాడు కానీ ప్రేమ సైలెంట్ గా ఉంటుంది.
ఆ తర్వాత ప్రేమ గురించి ధీరజ్ ఆలోచిస్తుంటే చందు వస్తాడు. థాంక్స్ రా డబ్బు అరేంజ్ చేసావ్ అంటాడు. ఎలా అరేంజ్ చేసావ్ రా అని అడుగుతాడు. ధీరజ్ ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. మరొకవైపు సాగర్ కి ఎగ్జామ్ ఉంటుంది. నర్మద, సాగర్ ఇద్దరు దేవుడికి మొక్కుకుంటారు. అదంతా శ్రీవల్లి చూస్తుంది. నాకు మా నాన్న ఆశీర్వాదం కూడా కావాలని సాగర్ అంటాడు. రిస్క్ వద్దు సాగర్ అని నర్మద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |